న్యూఢిల్లీ: మీరు ఈ నెలలో మీ ఖాతా ఉన్న బ్యాంక్ శాఖను సందర్శించాలని భావిస్తున్నారా.. అయితే.. ఈ నెలలో 15 రోజుల పాటు సెలవుల వల్ల బ్యాంకులు పని చేయవు. కనుక మీరు మీ బ్యాంక్ శాఖను సందర్శించడానికి బయలుదేరే ముందు ఒకసారి ముఖ్యమైన బ్యాంక్ హాలీడేస్ జాబితాను చెక్ చేసుకుంటే సరి..
బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు క్యాటగిరీలుగా విడదీసింది. హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే , బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ పేరిట విభజించింది.
ఈ నెలలో వచ్చే పలు పర్వదినాలు.. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో ఆయా పండుగలకు సెలవులు వచ్చేశాయి. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకింగ్ కంపెనీలు బ్యాంక్ హాలీడేలు పాటించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, లేదా ప్రభుత్వాల నోటిఫికేషన్లను బట్టి బ్యాంకులకు సెలవులు ఇస్తారు.
ఆదివారంతోనే ఆగస్టు నెల మొదలైంది. కనుక బ్యాంకులకు సెలవు. దీంతోపాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం ఎనిమిది సెలవులు వస్తాయి. ఆగస్టు 15 కూడా ఆదివారం.. స్వాతంత్ర్య దినోత్సవం..
పార్శీ నూతన సంవత్సరాది సందర్భంగా ఆగస్టు 16న బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్ వాసులు సంబురాలు చేసుకుంటారు. 19న మొహరం సందర్భంగా అగర్తల, అహ్మదాబాద్, బెలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
ఈ నెలలో సెలవులు ఇవే..:
ఆగస్టు 1- ఆదివారం
ఆగస్టు 8- ఆదివారం
ఆగస్టు 13- దేశభక్తుల దినోత్సవం
ఆగస్టు 14- రెండో శనివారం
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం, ఆదివారం
ఆగస్టు 16- పార్శీ నూతన సంవత్సరాది
ఆగస్టు 19- మొహర్రం
ఆగస్టు 20-మొహర్రం/ఫస్ట్ ఓనం
ఆగస్టు 21- తిరువోనం
ఆగస్టు 22- ఆదివారం
ఆగస్టు 23- శ్రీ నారాయణ గురు జయంతి
ఆగస్టు 28- నాలుగో శనివారం
ఆగస్టు 29- ఆదివారం
ఆగస్టు 30- జన్మాష్టమి
ఆగస్టు 31: శ్రీ క్రుష్ణ అష్టమి
Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో రచ్చ.. ‘ముంజాల్స్’లో విభేదాలు.. ఎందుకంటే?!
Oxygen : చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
Asaduddin Owaisi: మోదీకి హిందూ మహిళల సాధికారత అక్కర్లేదా..?
TS Cabinet : వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
TS Cabinet : 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు త్వరలోనే శంకుస్థాపన
Sai Pallavi Tamil | కోలీవుడ్ కమ్‌బ్యాక్ కు సాయి పల్లవి ప్లాన్..?
పుష్ప2 లో నెగెటివ్ రోల్ చేయనున్న సోనూసూద్.. ప్రేక్షకులు అంగీకరిస్తారా..!
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా