ఏప్రిల్‌లో ఏకంగా 12 రోజులు మూత
ముంబై, మార్చి 24: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు మళ్లీ వరుసగా సెలవులు రాబోతున్నాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కాలంలో కేవలం రెండు రోజులు (మార్చి 30, ఏప్రిల్ 3 తేదీల్లో) మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు పనిచేయవు. అంతేకాకుండా ఏప్రిల్‌లో ఏకంగా 12 రోజులు మూతపడతాయి. ఈ సెలవు దినాల్లో నెట్‌బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండకపోయినప్పటికీ ఇతర అవసరాల కోసం ఖాతాదారులు ముందే మేల్కోవడం మంచిది.
ఇదీ జాబితా..
మార్చి 27 : నాలుగో శనివారం
మార్చి 28 : ఆదివారం
మార్చి 29 : హోలీ
మార్చి 31 : ఆర్థిక సంవత్సరం చివరి రోజు
ఏప్రిల్ 1 : వార్షిక ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2 : గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4 : ఆదివారం
ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
ఏప్రిల్ 10 : రెండో శనివారం
ఏప్రిల్ 11 : ఆదివారం
ఏప్రిల్ 13 : ఉగాది
ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 : ఆదివారం
ఏప్రిల్ 21 : శ్రీరామ నవమి
ఏప్రిల్ 24 : నాలుగో శనివారం
ఏప్రిల్ 25 : ఆదివారం