శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 08, 2020 , 00:34:01

బెంగళూరు-బీదర్‌ ట్రూజెట్‌ సర్వీసు

బెంగళూరు-బీదర్‌ ట్రూజెట్‌ సర్వీసు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: ఉడాన్‌ సేవల్లో భాగంగా ట్రూజెట్‌ శుక్రవారం బీదర్‌కు విమాన సర్వీసును ప్రారంభించింది. దీన్ని ముఖ్యమంత్రి యెడియూరప్ప బెంగళూరులో ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ఇదే విమానంలో యెడియూరప్ప, సహచర ఎమ్మెల్యేలు, అధికారులు బీదర్‌కు కేవలం 1:40 గంటల్లో వెళ్లారన్నది. బస్సు ప్రయాణం 12 గంటలు కావడం గమనార్హం. బెంగళూరు నుంచి బీదర్‌కు రోజూ సర్వీసులుంటాయన్న ట్రూజెట్‌.. ఉదయం 11:25 గంటలకు బెంగళూరు నుంచి, మధ్యాహ్నం 1:35 గంటలకు బీదర్‌ నుంచి బయలుదేరుతుందని ప్రకటించింది.


logo