e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News లాక్‌డౌన్ ఎత్తేయాలంటే.. త్రిసూత్ర ప‌థ‌కం: ఐసీఎంఆర్‌

లాక్‌డౌన్ ఎత్తేయాలంటే.. త్రిసూత్ర ప‌థ‌కం: ఐసీఎంఆర్‌

లాక్‌డౌన్ ఎత్తేయాలంటే.. త్రిసూత్ర ప‌థ‌కం: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: క‌రోనా నియంత్ర‌ణ‌కు విధించిన లాక్‌డౌన్‌ల‌ను ఎత్తివేయ‌డానికి భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎంఆర్‌) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ త్రిసూత్ర ప‌థ‌కాన్ని సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి వ్యాక్సినేష‌న్‌ , కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో కూడిన ప్రవర్తన త‌దిత‌ర‌ అంశాల ఆధారంగానే లాక్‌డౌన్‌ల స‌డ‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణయం తీసుకోవాలన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని బలరామ్‌ భార్గవ తెలిపారు.

ప్రతి వారం పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉండాలి. కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నవర్గాలకు 70 శాతం వ్యాక్సినేష‌న్ వేయాలి. ప్ర‌జ‌లు త‌మ సామాజిక బాధ్యతగా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ ఉండాలి. అటువంటి ప్రాంతాల్లో మాత్ర‌మే లాక్‌డౌన్ తొల‌గించాల‌ని బ‌ల‌రామ్ భార్గవ చెప్పారు.

క‌రోనా పరీక్షలను పెంచి జిల్లా స్థాయిలో కంటైన్మెంట్‌లను ఏర్పాటు చేయడం అంత ప్రభావవంతంగా ఉండదని బ‌ల‌రామ్ భార్గం చెప్పారు. అత్యంత‌ నెమ్మ‌దిగా లాక్‌డౌన్‌లను సడలించాలని హిత‌వు చెప్పారు.

లాక్‌డౌన్ ఎత్తేయాలంటే.. త్రిసూత్ర ప‌థ‌కం: ఐసీఎంఆర్‌

ఆయ‌న సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ఇప్పటి వరకు నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు. వ‌చ్చే నెల మ‌ధ్య నుంచి ఆగ‌స్టు మొద‌టి వారానిక‌ల్లా ప్ర‌తి రోజూ కోటి మందికి వ్యాక్సినేష‌న్ చేసే అవ‌కాశం ఉంద‌ని బ‌ల‌రామ్ భార్గ‌వ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

‘టీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరూ వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌నుకుంటున్నారు. అయితే, దేశ‌మంతా ఒక్క నెల‌లోనే వ్యాక్సినేష‌న్ చేయ‌లేం. మన జనాభా అమెరికా జనాభా కంటే 4 రెట్లు ఎక్కువ. కొంత ఓపిక పట్టాలి’ అని ఆయన తెలిపారు.

ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు దేశ వ్యాప్తంగా 21.39%గా ఉన్న‌ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గింది. మే31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో ఐదు శాతానికంటే తక్కువ పాజిటివిటీ రేటు రికార్డు అవుతున్న‌ది.

గ‌త నెల‌ మొదటి వారంలో ఈ స్థాయి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 92 మాత్రమే. దేశ వ్యాప్తంగా మే7న నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. బుధవారానికి 1.32 లక్షలకు తగ్గ‌డం గ‌మ‌నార్హం.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఆటోకు కరోనా సెగ

దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి

ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే

22 కోట్ల కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న ముంబై కంపెనీ

మరో వైరస్‌ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు గర్తింపు

అంబులెన్సుల దందా.. 40 కి.మీట‌ర్ల‌కు రూ.17 వేలు

న్యూయార్క్‌ కన్నా ముంబైలో రెట్టింపు!

గర్భిణులకు 2-డీజీ వద్దు

రాందేవ్‌ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ

ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..

నో డౌట్‌: ఇప్ప‌ట్లో లీట‌ర్ పెట్రోల్ రూ.100 త‌గ్గ‌దు..!!

విదేశీ వ్యాక్సిన్ల‌కు ఆ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి సిద్ధం!

పాక్‌తో క‌లిసి వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న చైనా

పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌క‌పూర్‌, దిలీప్‌కుమార్ ఇళ్లు

అతిపెద్ద మాంస విక్రయ సంస్థ‌పై సైబ‌ర్ దాడి..

ఆ ఒక్క క‌రోనా వేరియంటే ఆందోళ‌న క‌లిగిస్తోంది: డ‌బ్ల్యూహెచ్‌వో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్ ఎత్తేయాలంటే.. త్రిసూత్ర ప‌థ‌కం: ఐసీఎంఆర్‌

ట్రెండింగ్‌

Advertisement