సోమవారం 01 మార్చి 2021
Business - Dec 15, 2020 , 18:08:40

రూ.3 ట్రిలియన్ దాటిన బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ కాపిటల్...

రూ.3 ట్రిలియన్ దాటిన బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ కాపిటల్...

ముంబై: బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి రూ.3 ట్రిలియన్ దాటింది. బీఎస్ఈలో ఈ సంస్థ స్టాక్ ఈరోజు 5 శాతం లాభపడి రూ.5,137కు ఎగిసింది. దీంతో బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.3.08 ట్రిలియన్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మధ్యాహ్నం గం.2.30 సమయానికి రూ.5,120 వద్ద ఉంది. మే 27వ తేదీన ఈ కంపెనీ స్టాక్ రూ.1,783 వద్ద ట్రేడ్ అయింది. నాటి నుంచి ఇప్పటి వరకు 188 శాతం కంటే ఎక్కువగా ఎగిసింది. ఏడాదిలో ఈ స్టాక్ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఐదు శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ధర... 

బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ధర ఇవాళ 5 శాతంపైగా పెరిగి రూ.5,150 వద్ద క్లోజ్ అయింది. ఎనిమిది నెలల కాలంలో రూ.1783 నుంచి రూ.5,150 వద్దకు చేరుకున్నది. దీంతో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థల్లో మరో రికార్డును నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15.34 ట్రిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల మార్కెట్ క్యాప్ వరుసగా రూ.10.6 ట్రిలియన్లు, రూ.7.72 ట్రిలియన్లుగా ఉంది.

అన్ లాక్ తర్వాత... 

 భారతదేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో పెట్టుబడిదారులు బజాజ్ ఫైనాన్స్ షేర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో కరోనా నష్టాల నుంచి బజాజ్ వేగంగా కోలుకొని, నెల ప్రాతిపదికన మంచి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా తెలిపింది. రిటైల్ ఈఎంఐ, వ్యాలెట్ లోన్స్ మినహాయించి మిగతా కార్యకలాపాలను ప్రారంభించింది. ఇవి జనవరి - మార్చి 2021లో ప్రారంభం కానున్నాయి.

నెట్ రికవరీలతోనే సాధ్యమైంది... 

కరోనా కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ నిరర్థక ఆస్తులు క్వార్టర్ ప్రాతిపదికన 37 బేసిస్ పాయింట్లు క్షీణించి 1.03 శాతంగా నమోదయ్యాయి. రూ.470 కోట్ల రైటాఫ్, నెట్ రికవరీల కారణంగా ఇది సాధ్యమైంది. పండుగ సీజన్ ప్రారంభమైందని, ఇప్పటికే కార్యకలాపాలు పుంజుకున్నాయని, మున్ముందు మరింత వృద్ధి కనిపించవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


 ఇవి కూడా చదవండి...పెరిగిన పసిడి ధరలు... 

సాగుభూమిలో వజ్రాలు... మిలీనియర్ గా మారిన రైతు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


VIDEOS

logo