గురువారం 04 జూన్ 2020
Business - May 06, 2020 , 00:29:24

మార్కెట్లోకి బజాజ్‌ శానిటైజర్లు

మార్కెట్లోకి బజాజ్‌ శానిటైజర్లు

హైదరాబాద్‌, మే 5: బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ మార్కెట్లోకి చేతి శానిటైజర్లను విడుదల చేసింది. బజాజ్‌ నోమార్క్స్‌ హ్యాండ్‌ శానిటైజర్లతో పిలువబడే ఈ ఉత్పత్తులతో సంస్థ నూతన వ్యాపారమైన పర్సనల్‌ హైజిన్‌ విభాగంలోకి ప్రవేశించినట్లు అయింది. 70 శాతానికి పైగా ఆల్కహాల్‌తో తయారైన ఈ శానిటైజర్‌ 99.9 % క్రిములపై పోరాడనున్నది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ శానిటైజర్‌ 50 ఎంఎల్‌ ధర రూ.25గాను, 100 ఎంఎల్‌ రూ.50, 200 ఎంఎల్‌ రూ.100కి, 5 లీటర్ల బాటిల్‌ ధరను రూ.2,500గా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సుమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో శానిటైజర్లకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొన్నదన్నారు. 


logo