గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Mar 11, 2020 , 23:19:29

బజాజ్‌ డామినర్‌ 250

బజాజ్‌ డామినర్‌ 250

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో..స్పోర్ట్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డామినర్‌ 250 పేరుతో విడుదల చేసిన ఈ బైకకు ధరను రూ.1.6 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 248.8 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు 27 పీఎస్‌ల శక్తినివ్వనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. యువతియువకులకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్‌ బైకును విడుదల చేసినట్లు కంపెనీ ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనాడే తెలిపారు.


logo