రుచి సోయా బోర్డులోకి రామ్‌దేవ్

- ఎండీగా ఆయన సోదరుడు రామ్ భరత్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆయన తమ్ముడు రామ్ భరత్‌తోపాటు రామ్‌దేవ్ సన్నిహిత సహచరుడు ఆచార్య బాలకృష్ణ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో చేరనున్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రామ్ భరత్ (41) నియామకాన్ని ఆమోదించాలని వాటాదారులకు పంపిన నోటీసులో రుచి సోయా ఇండస్ట్రీస్ కోరింది. దివాలాతీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను గతేడాది పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, దివ్య యోగ్ మందిర్ ట్రస్టు, పతంజలి పరివర్తన్ ప్రైవేట్ లిమిటెడ్, పతంజలి గ్రామోద్యోగ్ సంస్థలతో కూడిన కన్సార్షియం కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డును నియమించే హక్కు కొత్త యాజమాన్యానికి లభించిందని రుచి సోయా ఇండస్ట్రీస్ వెల్లడించింది. ‘ఈ ఏడాది ఆగస్టు 19న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశమై రామ్ భరత్‌ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, బాబా రామ్‌దేవ్ (49)ను డైరెక్టర్‌గా నియమించింది. అలాగే ఆచార్య బాలకృష్ణ (48)ను తిరిగి కంపెనీ చైర్మన్‌గా నియమించింది. ఈ నియామకాలను ఆమోదించాల్సిందిగా వాటాదారులను కోరుతున్నాం’ అని రుచి సోయా లిమిటెడ్ పేర్కొన్నది.
తాజావార్తలు
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
- పొట్టేళ్ల పందెం పోటీలు.. మూడు రాష్ర్టాల నుంచి 22 జీవాలు రాక
- శివుడి సాక్షిగా అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్
- చదివింది 'పది'.. వ్యాపారం 'కోటి'..
- ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
- అబద్ధాల బీజేపీ ఆరేండ్లుగా ఏం చేసింది?
- బీజేపీని నువ్వు కొన్నవా..?
- రైల్వే ఉద్యోగం పేరుతో మోసం
- పనిమనిషిపై పాశవికం..