e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home బిజినెస్ సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు
 • దాతృత్వంలో అజీం ప్రేమ్‌జీ టాప్‌
 • ముకేశ్‌ అంబానీ కంటే 17 రెట్లు అధికంగా విరాళాలు
 • గతేడాది రూ.7,904 కోట్లు ఇచ్చిన ఐటీ దిగ్గజం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలో తన తోటి కార్పొరేట్లకు అందనంత ఎత్తులో నిలిచారు. మునుపెన్నడూ లేనివిధంగా గతేడాది ఏకంగా రూ.7,904 కోట్లను ఆయన, ఆయన కుటుంబం విరాళాలుగా ఇచ్చినట్లు తాజాగా విడుదలైన ఎడిల్‌గీవ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా-2020లో తేలింది. ఇందులో శివ్‌ నాడర్‌, ముకేశ్‌ అంబానీ కుటుంబాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వీరి డొనేషన్లూ ఆల్‌టైమ్‌ హైలో ఉండటం విశేషం. కరోనా వైరస్‌ ధాటికి అన్ని భారతీయ రంగాలు కుప్పకూలిన వేళ.. నిరుడు దేశంలోని 90 మంది భారీ దాతలు, వారి కుటుంబాలు ఇచ్చిన విరాళాల విలువ రూ.9,324 కోట్లుగా ఉన్నది. ఇక రూ.10 కోట్ల కంటే ఎక్కువ విరాళాలనిచ్చిన దాతల సంఖ్య.. గడిచిన రెండేండ్లలో 37 నుంచి 80కి పెరిగినట్లు హురున్‌ తెలిపింది. జాబితాలోని వారి సగటు వయసు 66గా ఉండగా, 40 ఏండ్ల వయసులోనే ఈ లిస్టులోకి ఎక్కిన తొలి వ్యక్తిగా బిన్నీ బన్సల్‌ నిలిచారు. జాబితాలోకి కొత్తగా 30 మంది చేరగా, ఏడుగురు మహిళలున్నారు.

ఈ విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయ్‌?

కార్పొరేట్లు అత్యధికంగా తమ విరాళాలను విద్యా రంగానికే ఇస్తున్నారు. 79 శాతం నిధులు విద్యాభివృద్ధికే వెళ్తున్నాయి. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ రంగం ఉన్నది. కరోనా నేపథ్యంలో 2019తో పోల్చితే 2020లో హెల్త్‌కేర్‌కు విరాళాలు 137 శాతం పెరుగడం గమనార్హం. విపత్తు నిర్వహణ-సాయానికీ 240 శాతం పెరిగాయి

టాప్‌-10 దాతలు (రూ.కోట్లలో)

 • పేరు సంస్థ విరాళం ఏ రంగానికి
 • అజీం ప్రేమ్‌జీ విప్రో 7,904 విద్య
 • శివ్‌ నాడర్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 795 విద్య
 • ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 458 విపత్తు సాయం
 • కుమార్‌ బిర్లా ఆదిత్యా బిర్లా 276 విద్య
 • అనిల్‌ అగర్వాల్‌ వేదాంత 215 ఆరోగ్య సంరక్షణ
 • అజయ్‌ పిరామల్‌ పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 196 విద్య
 • నందన్‌ నిలేకని ఇన్ఫోసిస్‌ 159 స్థిరమైన అభివృద్ధి
 • హిందుజా బ్రదర్స్‌ హిందుజా 133 ఆరోగ్య సంరక్షణ
 • గౌతమ్‌ అదానీ అదానీ 88 విద్య
 • సుధీర్‌, సమీర్‌ మెహెతాలు టొర్రెంట్‌ ఫార్మా 82 ఆరోగ్య సంరక్షణ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సరిలేరు నీకెవ్వరు

ట్రెండింగ్‌

Advertisement