అజీమ్ ప్రేమ్‌జీకి ఏఐఎంఏ జీవితకాల పురస్కారం

న్యూఢిల్లీ: విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి శనివారం ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దేశంలో మేనేజ్మెంట్ విభాగంలో అత్యున్నత సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ఐమా ప్రతి ఏటా ఫౌండేషన్ దినం నాడు అవార్డులతో సత్కరిస్తుంది. ఇదే సందర్భంగా ఉత్తర రచనకు గాను డాక్టర్ రామ్ తర్నేజా అవార్డు, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో సృజనాత్మకత, ఆవిష్కరణలకు డాక్టర్ జేఎస్ జునేజా అవార్డులను కూడా ప్రదానం చేశారు. కాగా, ఈ సంవత్సరం, కార్పొరేట్ నాయకత్వానికి ఐమా జేఆర్డీ టాటా అవార్డును హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాకు ప్రదానం చేశారు. ఐమా పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రారంభోపన్యాసం చేశారు.
ఐమా ఫౌండేషన్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుతారు. 66 లోకల్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ ఈ వేడుకలను జరుపుకుంటున్నాయి. ఐమా 65 వ ఫౌండేషన్ డే.. అలాగే, 15 వ జాతీయ నిర్వహణ దినోత్సవం ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 న డిజిటల్‌గా జరుపుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మేషన్ ఫర్ కంటిన్యుటి అనే థీమ్‌తో ఈ ఏడాదంగా ఉత్సవాలు జరుపనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిపుణులకు ఐమా అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేస్తారు. ఈ పురస్కారాలను గతంలో ప్రముఖ కార్పొరేట్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యావేత్తలకు అందజేశారు. ఈసారి విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. "ఈ గౌరవాన్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. విప్రో, ఫౌండేషన్‌లో నా సహోద్యోగులు, నా భాగస్వాములు వేలాది మంది అలసిపోని అంకితభావంతో పనిచేయడం వల్లనే తనకు ఈ గుర్తింపు వచ్చిందని, ఈ గౌరవాన్ని వారితో పంచుకోవడంతో అవార్డుకు వన్నె తీసుకురాగలను అని అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. "దాతృత్వం లేదా సమాజానికి సహకారం అనేది మనసు లోపలి నుంచే రావాలి. అది బయటి నుంచి రావాలనడం తప్పనిసరి కాదు. వ్యక్తిగత దాతృత్వం.. సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నుంచి వేరుగా ఉండాలి" అని ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు
వ్యాక్సిన్ కోసం వేషం మార్చి అడ్డంగా బుక్కయ్యారు..
లాకర్ల భద్రత బాధ్యత బ్యాంకులదే : సుప్రీంకోర్టు
ఈ నకిలీ యాప్‌తో జాగ్రత్త.. దోచుకుంటారు..
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మోతేరా
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!