ఆదివారం 07 జూన్ 2020
Business - Apr 02, 2020 , 00:22:01

అజీం ప్రేమ్‌జీ 1,125 కోట్ల సాయం

అజీం ప్రేమ్‌జీ 1,125 కోట్ల సాయం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: ఆర్జనలోనే కాదూ.. ఆపదలోనూ ముందుంటామని దేశీయ కార్పొరేట్లు నిరూపిస్తున్నారు. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వందల కోట్ల రూపాయల్లో సాయం చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విప్రో లిమిటెడ్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ. 1,125 కోట్ల సాయంతో బుధవారం ముందుకొచ్చాయి. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ.1,000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్లతో ఔషధ, సేవా, పేదల అవసరాలను తీర్చేందుకు నడుం బిగించాయి. కాగా, నారాయణ హెల్త్‌ భాగస్వామ్యంతో బెంగళూరులో కొవిడ్‌-19 బాధితుల కోసం 100 గదుల క్వారంటైన్‌ దవాఖానను ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తున్నది. మరోవైపు పుణెలో కరోనా రోగుల కోసం 1,500 పడకలతో తాత్కాలిక దవాఖానను ఏర్పాటు చేస్తామని బుధవారం లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రకటించింది. 


logo