గురువారం 28 మే 2020
Business - Apr 01, 2020 , 14:36:26

విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ భారీ విరాళం

విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ భారీ విరాళం

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరు కోసం  విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మనవతా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి   తాజాగా విప్రో లిమిటెడ్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ కలిసి   రూ.1,125 కోట్ల  సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి.  మొత్తం విరాళంలో  విప్రో రూ.100కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా  కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.  

విప్రో  వార్షిక..కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్‌ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్‌ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.  విప్రో ఫౌండర్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ తన సంపాదనలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారు. 


logo