మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 23, 2020 , 02:15:57

హైదరాబాద్‌ మెట్రో ఎండీకి అవార్డు

హైదరాబాద్‌ మెట్రో ఎండీకి అవార్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌(ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) ఎండీ, సీఈఓ  కేవీబీ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రస్తుత సంవత్సరానికిగాను కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అవార్డ్‌ అనే సంస్థ ‘కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020’ అవార్డుతో సత్కరించింది.  ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ..  మూడున్నర దశాబ్దాలకుపైగా వృత్తి జీవితంలో చాలా నేర్చుకున్నానని, ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.