e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News Tesla Model-3 కోసం వెయిటింగ్‌.. భార‌త్‌లో ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ‌న్న మ‌స్క్‌

Tesla Model-3 కోసం వెయిటింగ్‌.. భార‌త్‌లో ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ‌న్న మ‌స్క్‌

న్యూఢిల్లీ: గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా మోడ‌ల్-3 కారును భార‌త విప‌ణిలో ఆవిష్క‌రించే టైం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ది. అయితే, ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో దిగుమ‌తి సుంకాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ పేర్కొన్నారు. యూజ‌ర్ల‌కు చౌక‌గా కారును అందుబాటులోకి తెచ్చేందుకు దిగుమ‌తి సుంకాలు త‌గ్గించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు కేంద్రానికి లేఖ రాశారు.

డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్కార్‌కు ఆదాయం

వినియోగ‌దారుల డిమాండ్ పెరిగినా కొద్దీ ప్ర‌భుత్వానికి ల‌భించే ఆదాయం పెరుగుతుంద‌ని టెస్లా వ్యాఖ్యానించింది. భార‌త్‌లో టెస్లా కార్ల‌ను ఆవిష్క‌రించాల‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఎల‌న్‌మ‌స్క్‌ను అభ్య‌ర్థిస్తున్నారు.

టెస్లా కారు ఆవిష్క‌ర‌ణ‌కు రెడీ.. కానీ

- Advertisement -

త్వ‌ర‌గా టెస్లా కారును విప‌ణిలో విడుద‌ల చేయాల‌ని యూ-ట్యూబ‌ర్ మ‌ద‌న్ గౌరి త‌న ఖాతాలో పోస్ట్ చేస్తే.. మ‌స్క్ స్పందించారు. త‌మ‌కూ భార‌త విప‌ణిలో కార్ల‌ను ఆవిష్క‌రించాల్సి ఉందన్నారు. కానీ ప్ర‌పంచంలోని పెద్ద దేశాల కంటే కూడా భార‌త్‌లో దిగుమ‌తి సుంకాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు.

కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌కు ఇలా టెస్లా లేఖ‌లు

ఒక ఆంగ్ల దిన‌ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం భార‌త్‌లో టెస్లా కార్ల అమ్మ‌కాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దిగుమ‌తి సుంకాలు త‌గ్గించాల‌ని కోరుతూ కేంద్ర మంత్రుల‌కు, నీతి ఆయోగ్‌కు లేఖ‌లు రాసింది. పూర్తిస్థాయిలో భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను అసెంబ్లింగ్ చేస్తున్నందున 40 శాతం దిగుమ‌తి సుంకం త‌గ్గించాల‌ని కోరింది.

అయితే, కేంద్రానికి రాసిన లేఖ‌ను టెస్లా విడుద‌ల చేయ‌లేదు. టెస్లా రాసిన లేఖ‌పై ఇటు కేంద్ర మంత్రులు గానీ, నీతి ఆయోగ్ గానీ ప్ర‌తిస్పందించ‌లేదు. టెస్లా యాజ‌మాన్యం కూడా రియాక్ట్ కాలేదు. భారీ ప‌రిశ్ర‌మ‌లు, ర‌వాణామంత్రిత్వ‌శాఖ‌ల‌కు టెస్లా లేఖ రాసిన‌ట్లు స‌మాచారం.

100% దిగుమ‌తి సుంకంతో ఖ‌ర్చు అద‌నం

విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే కార్ల‌పై సుంకాలు 100 శాతం విధిస్తే 40వేల పై చిలుకు డాల‌ర్ల ఖ‌ర్చు అద‌నం అవుతుంది. అయితే, 40 శాతం దిగుమ‌తి సుంకం త‌గ్గిస్తే భార‌తీయుల‌కు చౌక‌గా ల‌భ్యం అవుతుంది.

టెస్లా మోడ‌ల్‌-3 కారు ధర రూ.30ల‌క్ష‌లే

టెస్లా అమెరికా వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం ఆ సంస్థ మోడ‌ల్‌-3 స్టాండ‌ర్డ్ రేంజ్ ప్ల‌స్ కారు ధ‌ర 40 వేల డాల‌ర్ల లోపు (సుమారు రూ.30 ల‌క్ష‌లు మాత్ర‌మే). ప్రీమియం ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌కు భార‌త్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా గ‌తేడాది కేవ‌లం 5000 వెహిక‌ల్స్ మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి.

క‌స్ట‌మ‌ర్‌కు ఖ‌ర్చు.. ఇన్‌ఫ్రా లేమి స‌వాళ్లు

స‌గ‌టు క‌స్ట‌మ‌ర్‌కు విద్యుత్ వాహ‌నాలు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అలాగే చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లేమి కూడా ఇబ్బందిక‌ర‌మే. గ‌తేడాది 24 ల‌క్ష‌ల కార్లు భార‌త్‌లో అమ్ముడైతే వాటిలో విద్యుత్ కార్లు 5000 మాత్ర‌మే. అదీ కూడా 28 వేల డాల‌ర్ల లోపే. భార‌త్‌లో టెస్లా విద్యుత్ కార్ల ఉత్ప‌త్తికి ముందుకు వ‌స్తే అందుకు ప్రోత్సాహాలు అందిస్తామ‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Chanu Saikhom Mirabai | క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి

మీరాబాయి చానుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

Tokyo Olympics: తొలి గోల్డ్ మెడ‌ల్ చైనా ఖాతాలో.. ఇండియ‌న్ షూట‌ర్లు ఫెయిల్‌

చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్‌ ఇది

మీరాబాయి చాను కోచ్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి

గోల్డ్ కోసం చాలా ప్ర‌య‌త్నించాను కానీ..: మీరాబాయ్ చాను

Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్‌పై విజయం

Tokyo Olympics : ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో ఫైన‌ల్‌కు భార‌త్

బ్ర‌హ్మాజీతో జాగ్ర‌త్త‌గా ఉండు.. నాగ‌శౌర్య‌కు రానా సూచ‌న‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana