శనివారం 30 మే 2020
Business - May 03, 2020 , 14:48:53

పెట్రోల్ కంటే విమాన ఇంధ‌న‌మే అగ్గువ‌!

పెట్రోల్ కంటే విమాన ఇంధ‌న‌మే అగ్గువ‌!

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ కార‌ణంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అన్ని ర‌కాల ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోయాయి. ఈ ప్ర‌భావం ముడి చ‌మురుపై తీవ్రంగా ప‌డింది. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ త‌గ్గ‌డంతో ధ‌ర‌లు అత్యంత క‌నిష్ట‌స్థాయికి ప‌డిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు భారీగా ప‌త‌నం కావ‌డంతో విమానాల్లో ఉప‌యోగించే ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఫ్యూయ‌ల్ (ఏటీఎఫ్‌) ధ‌ర కూడా బాగా త‌గ్గింది. ఒక కిలోలీట‌ర్ (వెయ్యి లీట‌ర్లు) క్రూడ్ ఆయిల్ ధ‌ర రూ.64,323.76 నుంచి ఏకంగా రూ.22,544.75కి పడిపోయింది. అంటే ఒక లీట‌ర్ విమాన ఇంధ‌న ధ‌ర కేవ‌లం రూ.22.54 అన్న‌మాట‌. పెట్రోల్ ధ‌ర‌తో పోల్చిన‌ప్పుడు ఇది కేవ‌లం మూడో వంతు మాత్ర‌మే. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo