శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 01:11:40

అంచనాలు మించిన డీ-మార్ట్‌

అంచనాలు మించిన డీ-మార్ట్‌
  • -క్యూ3లో 53 శాతం పెరిగిన లాభం

ముంబై, జనవరి 11: డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.394.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.257.10 కోట్ల లాభంతో పోలిస్తే 53.3 శాతం వృద్ధిని కనబరిచింది. పన్ను చెల్లింపులు తగ్గుముఖం పట్టడం, ఆదాయం, ఆపరేటింగ్‌ ఆదాయం పుంజుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23.9 శాతం ఎగబాకి రూ.6,751.90 కోట్లుగా నమోదైంది. అంచనావేసిన స్థాయిలోనే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయని, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం కలిసొచ్చిందని కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లి నొరోన్హా తెలిపారు. గత తొమ్మిది నెలల్లో సంస్థ దేశవ్యాప్తంగా 20 స్టోర్లను ప్రారంభించింది. గడిచిన ఆరు నెలల్లో కంపెనీ షేరు ధర 39 శాతం బలపడింది.


logo