శనివారం 30 మే 2020
Business - Mar 30, 2020 , 19:02:47

కరోనా ప్రభావం.. డీలాపడ్డ ఆటోమొబైల్‌ రంగం

కరోనా ప్రభావం.. డీలాపడ్డ ఆటోమొబైల్‌ రంగం

కరోనావైరస్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం పై మరింతగా ప్రభావం చూపిస్తున్నది. ఏప్రిల్ 14, 2020 వరకు మొత్తం దేశం లాక్ డౌన్ ఉండడంతోపాటు, అమ్ముడుపోని బిఎస్ 4 వాహనాలతో మరింత భారం పడింది. ఉద్యోగుల జీతాలతో పాటు ఇతర ఖర్చులతో ఆటోమొబైల్ డీలర్ షిప్ సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో డీలర్‌షిప్‌లు మొత్తం, 4 6,400 కోట్ల విలువైన బిఎస్ 4 వాహనాలను కలిగి ఉన్నాయి.  వీటిలో మొత్తం 7 లక్షల యూనిట్లు అమ్ముడుపోని బిఎస్ 4 ద్విచక్ర వాహనాలతో పాటు 1పై 2,000 బిఎస్ 4 ప్యాసింజర్  కార్లు, 7,000 బిఎస్ 4 వాణిజ్య వాహనాల యూనిట్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) తెలిపింది. అమ్ముడుపోని వాహనాల నిర్వహణ కు అయ్యే ఖర్చు, ఉద్యోగుల జీతాలు ఆటోమొబైల్ డీలర్స్ కు మోయలేని భారంగా మారాయి.


logo