మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 16, 2021 , 03:07:31

మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్న సంస్థలు

మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్న సంస్థలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఆటోమొబైల్‌ సంస్థలు షాకివ్వబోతున్నాయి. మొన్నటికిమొన్న ధరలను పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. స్టీల్‌ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో గత నెలలో సుమారు 5 శాతం వరకు ధరలు పెంచిన సంస్థలు..వచ్చే రెండు నెలల్లో మరో మూడు శాతం వడ్డించడానికి రెడీ అవుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా అమ్మకాలు పడిపోయి ఢీలాపడిన సంస్థలు ఇటీవల మళ్లీ తిరిగి పుంజుకున్నాయి.  

స్టీల్‌ ధరలే కారణం

ముడి సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆటోమొబైల్‌ సంస్థలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నది. గత మూడు నెలల్లో స్టీల్‌, ఇతర ముడిసరుకుల ధరలు 30 శాతం వరకు ఎగబాకగా..భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి. గతంలో రూ.37 వేలుగా ఉన్న టన్ను స్టీల్‌ ధర ప్రస్తుతం రూ.60 వేల స్థాయికి చేరుకున్నది. జూన్‌ 2020 నుంచి ఇప్పటి వరకు ధరలు 50 శాతం వరకు ఎగబాకాయి. 

VIDEOS

logo