శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 26, 2021 , 18:24:10

ప‌ర్స‌న‌ల్ వెహికిల్స్‌కూ ఫిట్‌నెస్: ఆర్‌సీ భార్గ‌వ‌

ప‌ర్స‌న‌ల్ వెహికిల్స్‌కూ ఫిట్‌నెస్: ఆర్‌సీ భార్గ‌వ‌

ముంబై: ‌ప్ర‌తి రెండు లేదా మూడేండ్ల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌యాణ వాహ‌నాల‌కు ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ విధానాన్ని ఎందుకు అమ‌లు చేయ‌ర‌ని ప్ర‌ముఖ ప్ర‌యాణికుల కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి చైర్మ‌న్ ఆర్‌సీ భార్గ‌వ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి వాణిజ్య వాహ‌నాల‌కు మాత్ర‌మే ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ జారీ ప్ర‌క్రియ అమ‌లులో ఉంది. ప్ర‌తి రెండు, మూడేండ్ల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌యాణ వాహ‌నాల‌కు కూడా ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ విధానం అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణమేమిటో త‌న‌కు తెలియ‌ద‌ని ఆర్‌సీ భార్గ‌వ పేర్కొన్నారు. 

వాణిజ్య‌, వ్య‌క్తిగ‌త ప్ర‌యాణ వాహ‌నాల‌కు కూడా స‌మ‌ర్థ‌వంతమైన ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ జారీ విధానాన్ని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని భార్గ‌వ స్ప‌ష్టం చేశారు. కాలుష్యం, ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వాహ‌నాల‌ను త‌ప్ప‌నిస‌రిగా త‌నిఖీ చేయాల్సిందేన‌న్నారు. ఒక వాణిజ్య వాహ‌నం రోడ్డుపైకి వ‌చ్చిన 15 ఏండ్లు దాటిన త‌ర్వాత.. ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డానికి వ‌సూలు చేసే గ్రీన్‌ట్యాక్స్ భారీగా లేకుంటే, వాటి వినియోగాన్ని నిరుత్సాహ ప‌ర్చ‌లేమ‌ని త‌న అభిప్రాయం అని పేర్కొన్నారు. భారీగా గ్రీన్ టాక్స్ విధిస్తే త‌ప్ప‌, ప్ర‌జ‌లు కాలుష్య కార‌క‌, అభ‌ద్ర‌త గ‌ల వాహ‌నాల వాడ‌కాన్ని కొన‌సాగిస్తార‌ని వ్యాఖ్యానించారు. 

ఒక‌వేళ గ్రీన్ టాక్స్ విధానాన్ని స‌రిగ్గా అమ‌లు చేస్తే.. తాత్కాలిక స్క్రాపేజ్ విధానానికి బ‌దులు గ్రీన్ టాక్స్ విధాన‌మే శాశ్వ‌తం కాగ‌ల‌ద‌ని ఆటోమేక‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, స్క్రాపేజీ విధానంతోపాటు ఇన్సెంటివ్‌ల‌ను ర‌ద్దుచేయ‌డంతో ప‌లు దేశాల్లో వాహ‌నాల విక్ర‌యాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఎనిమిదేండ్లు దాటిన వాణిజ్య‌, ర‌వాణా వాహ‌నాల వినియోగంపై 10-25 శాతం గ్రీన్ ట్యాక్స్ విధించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 15 ఏండ్ల గ‌డువు ఉంది. అయితే, దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత లాంఛ‌నంగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo