ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 21, 2021 , 02:12:09

వాహన బీమా కుదేలు

వాహన బీమా కుదేలు

లాక్‌డౌన్‌ ప్రభావమే కారణం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మోటర్‌ ఇన్సూరెన్స్‌ను కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఆదాయానికి పెద్ద ఎత్తునే గండి కొట్టింది. మునుపెన్నడూ లేనివిధంగా వచ్చిపడిన లాక్‌డౌన్‌.. దాంతో తలెత్తిన ఆర్థిక మందగమనం మోటర్‌ ఇన్సూరెన్స్‌ను కుదేలు చేసింది. దీంతో ఈసారి ఆదాయం గత ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోల్చితే భారీగా పడిపోయింది. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ మరికొద్ది నెలలదాకా జోరు కనిపించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో వాహన బీమా ప్రీమియం విలువ 24 శాతం దిగజారింది. కరోనాను అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా ఏప్రిల్‌-మే నెలల్లో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ఇన్సూరెన్స్‌లు, రెన్యువల్స్‌ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జూలై-సెప్టెంబర్‌లో ఆదాయం పెరిగినప్పటికీ.. 2019 ఇదే వ్యవధితో చూస్తే మాత్రం 4 శాతం తక్కువే. అయితే అక్టోబర్‌-డిసెంబర్‌లో 8 శాతం పెరిగింది. కాగా, మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరిలో గతంతో చూస్తే మాత్రం ప్రీమియం 4.57 శాతం మేర తగ్గింది. 

VIDEOS

logo