శనివారం 05 డిసెంబర్ 2020
Business - Oct 27, 2020 , 02:24:45

అమెరికా యూనిట్‌ను అమ్మేస్తున్న అరబిందో

అమెరికా యూనిట్‌ను అమ్మేస్తున్న అరబిందో

  • ఒప్పందం విలువ రూ.4,048 కోట్లు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా అమెరికాలోని తమ అనుబంధ యూనిట్‌ నాట్రోల్‌ను అమ్మేస్తున్నది. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ న్యూ మౌంటెయిన్‌ క్యాపిటల్‌కు రూ.4,048 కోట్ల (550 మిలియన్‌ డాలర్లు)కు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అరబిందో సోమవారం వెల్లడించింది. జారో ఫార్ములస్‌తో కలిసి నాట్రోల్‌ను న్యూ మౌంటెయిన్‌ క్యాపిటల్‌ కొననుందని ఓ ప్రకటనలో పేర్కొన్నది. నగదు రూపంలోనే ఈ డీల్‌ జరుగుతుందని స్పష్టం చేసిన అరబిందో.. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ లావాదేవీ పూర్తికావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా, సంస్థ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇతర నూతన వ్యూహాత్మక కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చిస్తామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ తెలిపారు. 2014 డిసెంబర్‌లో నాట్రోల్‌ను అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది.