బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Sep 16, 2020 , 00:45:36

బిరాక్‌తో అరబిందో దోస్తీ

బిరాక్‌తో అరబిందో దోస్తీ

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధికి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బిరాక్‌)తో అరబిందో ఫార్మా మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. బిరాక్‌ సహకారం తీసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అమెరికా అనుబంధ సంస్థ అరో వ్యాక్సిన్స్‌ ద్వారా ఈ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని తెలిపింది. ‘వైరల్‌ వ్యాక్సిన్ల తయారీ కోసం ఓ స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం. ఇక్కడ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఇతర వైరల్‌ వ్యాక్సిన్లనూ ఉత్పత్తి చేస్తాం’ అని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ ప్లాంట్‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందన్నది.


logo