న్యూఢిల్లీ, ఆగస్టు 27: తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి క్యాన్సర్ ఇంజెక్షన్ సైక్లోఫోస్ఫమైడ్కు ఆమోదం పొందిందని అరబిందో ఫార్మా శుక్రవారం తెలిపింది. వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలో ఈ ఇంజెక్షన్‌ను వాడుతారని పేర్కొన్నది. రెడీ-టు-యూజ్ ఇంజెక్షన్ ప్రిపరేషన్లో ఈ ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.