శనివారం 26 సెప్టెంబర్ 2020
Business - Aug 13, 2020 , 00:04:46

అరబిందో రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌

అరబిందో రూ.1.25  మధ్యంతర డివిడెండ్‌

హైదరాబాద్‌: అరబిందో ఫార్మా ఆర్థిక ఫలితాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. జూన్‌ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.780.68 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.635.68 కోట్ల లాభంపై 22.81 శాతం పెరుగుదల కనిపించింది. అమెరికాలో కంపెనీకి చెందిన ఔషధాలకు డిమాండ్‌ అధికంగా ఉండటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని  బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలానికిగాను సంస్థ రూ.5,924.78 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. కంపెనీ షేరు ధర 1.14 శాతం తగ్గి రూ.934 వద్ద ముగిసింది. 


logo