గురువారం 04 జూన్ 2020
Business - Apr 09, 2020 , 23:26:12

అరబిందో ఫార్మా రూ. 10 కోట్ల విరాళం

అరబిందో ఫార్మా రూ. 10 కోట్ల విరాళం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కోవిడ్‌-19 నివారణ కోసం జరుగుతున్న  ప్రయత్నాలకు మద్దతుగా తమ  వంతు సహాయం చేయడానికి అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రధాని సహాయ నిధికి రూ.10 కోట విరాళాన్ని అందించింది.  ఈ నిధులను ఎస్బీఐ హైదరాబాద్‌ నుంచి పీఎం కేర్‌ ఫండ్‌కు బదిలీ చేసినట్లు కంపెనీ చైర్మన్‌ కే నిత్యానందరెడ్డి, పూర్తి కాలపు డైరెక్టర్‌ పీ శరత్‌చంద్రారెడ్డిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్‌ రెస్పాన్సబులిటి కింద ప్రధాని సహాయ నిధికి రూ 10 కోట్ల విరాళం ఇచ్చిన అరబిందో ఫార్మాను అభినందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి నిత్యానందరెడ్డికి లేఖ రాశారు.logo