ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 07, 2020 , 02:09:06

అరబిందో ఫార్మా లాభం రూ.705 కోట్లు

అరబిందో ఫార్మా లాభం రూ.705 కోట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 6: అరబిందో ఫార్మా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రూ.705.3 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది రూ.712.2 కోట్లుగా ఉన్నది. ఆదాయం మాత్రం ఈసారి దాదాపు 12 శాతం పెరిగి రూ.5,895 కోట్లుగా ఉన్నట్లు గురువారం స్టాక్ ఎక్సేంజీలకు సంస్థ తెలియజేసింది. నిరుడు రూ.5,269.7 కోట్లుగా ఉన్నది.


logo