బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలయితే చార్జీలు

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బులు లేకపోయినా ఏటీఎం ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తే చార్జీలు తప్పవు. బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలయిన సందర్భాల్లో దేశంలోని పలు బ్యాంకులు పలు రకాలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారుల నుంచి రూ.20తోపాటు జీఎస్టీ వసూలు చేస్తున్నది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ రూ.25తోపాటు జీఎస్టీని అపరాద రుసుముగా వసూలు చేస్తున్నాయి. యాక్సిస్, కొటక్ మహేంద్ర బ్యాంకులు రూ.25 వసూలు చేస్తున్నాయి.
బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలయిన సందర్భాల్లో సాధారణంగా జాతీయ బ్యాంకులు రూ.20తోపాటు జీఎస్టీ, ప్రైవేట్ బ్యాంకులు రూ.25తోపాటు కొన్ని సందర్భాల్లో పన్నులు కలిపి చార్జీలుగా వసూలు చేస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా ఏటీఎం ద్వారా డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే సంబంధిత బ్యాంకులు చార్జీలు విధించడం అన్నది కొత్త నిబంధన కాదు. కాకపోతే బ్యాంకు వినియోగదారులుకు దీనిపై సరైన అవగాహన లేదు.
ఇకపై ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే ముందు మీ బ్యాంకు ఖాతాలో ఆ మేరకు బ్యాలెన్స్ ఉందా లేదా అన్నది ముందుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తగినంత బ్యాలెన్స్ లేదంటే ట్రాన్సాక్షన్ ఫెయిలయిన సందర్భాల్లో ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు రూ.20 నుంచి రూ.25తో పాటు పన్నులను పెనాల్టీగా వసూలు చేస్తున్నాయి. సో.. ఇకనైనా జాగ్రత్త వహించండి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. పిల్లల్ని కిటికీలోంచి పడేసిన తల్లి
- ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్స్ ప్రదర్శన
- స్నిఫర్ డాగ్‌కు ఘనంగా వీడ్కోలు.. వీడియో
- పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు