ఆదివారం 05 జూలై 2020
Business - Jul 01, 2020 , 00:37:58

ఏటీఎం వినియోగదారులూ జాగ్రత్త

ఏటీఎం వినియోగదారులూ జాగ్రత్త

  • నేటి నుంచి మళ్లీ పాత నిబంధనలు

న్యూఢిల్లీ: ఏటీఎం నగదు ఉపసంహరణలు సహా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పలు నిబంధనలు బుధవారం (జూలై 1) నుంచి మారనున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలకు మూడు నెలలపాటు ఇచ్చిన మినహాయింపుల గడువు మంగళవారంతో ముగియడంతో మళ్లీ పాత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో నెలవారీ పరిమితి దాటిన తర్వాత జరిపే ఏటీఎం, ఇతర లావాదేవీలపై బ్యాంకు చార్జీలు వసూలుచేసే అవకాశమున్నది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. logo