మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Feb 12, 2020 , 23:55:53

అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత

అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: హిందుజా గ్రూపునకు చెందిన వాహన విక్రయ సంస్థ అశోక్‌ లేలాండ్‌ మూడో త్రైమాసికానికిగాను రూ.57.11 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.428.76 కోట్లతో పోలిస్తే 86.68 శాతం క్షీణించింది.  కంపెనీ ఆదాయం  రూ. 5,188.84 కోట్లకు పడిపోయింది.  ఆటోమొబైల్‌ రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో అమ్మకాలు భారీగా పడిపోయాయని అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈవో విపిన్‌ సోంధీ తెలిపారు.  బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. 
logo