గురువారం 28 జనవరి 2021
Business - Sep 09, 2020 , 02:33:36

అశోక్‌ లేలాండ్‌ గౌరవ చైర్మన్‌ షహనీ కన్నుమూత

అశోక్‌ లేలాండ్‌ గౌరవ చైర్మన్‌ షహనీ కన్నుమూత

న్యూఢిల్లీ: అశోక్‌ లేలాండ్‌ సంస్థ గౌరవ చైర్మన్‌ ఆర్‌జే షహనీ (89) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కంపెనీకి తొలి భారతీయ మేనేజింగ్‌ డైరెక్టరైన షహనీ.. 1978 నుంచి 1998 వరకు 20 ఏండ్లపాటు ఆ హోదాలోనే కొనసాగారు. ఆ తర్వాత 2010 వరకు సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. సంస్థ తయారీ, ఇంజినీరింగ్‌, టెక్నాలజీల్లో షహనీ తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి తమ గ్రూప్‌కి తీరని లోటని అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు.


logo