సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 19:05:43

కరోనాతో బజాజ్‌ ఆటో ప్లాంట్‌ లాక్‌డౌన్‌

కరోనాతో బజాజ్‌ ఆటో ప్లాంట్‌ లాక్‌డౌన్‌

మహారాష్ట్ర : 79 మంది ఉద్యోగులు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో ఔరంగాబాద్‌లోని బజాజ్ ఆటో తయారీ కర్మాగారాన్ని మూసివేశారు. ఇన్నేండ్ల తమ వ్యాపారంలో లాక్‌డౌన్‌ అన్నదే తెలియన బజాజ్‌ ఆటో లిమిటెడ్‌.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటించాల్సి వచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మోటారు సైకిళ్ళు, ఆటో ఎగుమతుల్లో ఎక్కువ కార్యకలాపాలను  నిర్వహించే ఈ ప్లాంట్‌లో ఏప్రిల్ 22 నుంచి తక్కువ మంది కార్మికులతో పనులు నిర్వహిస్తున్నారు. 

గత కొన్నిరోజులుగా ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల కొందరు అస్వస్థతకు గురవడంతో.. అక్కడి ఉద్యోగులకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల్లో 79 మంది పాజిటివ్‌గా తేలింది. దాంతో వైరస్‌ ఇతరులకు సోకకుండా ఉండేందుకు ప్లాంట్‌ను కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. పాజిటివ్‌గా వచ్చిన వారిలో కొందరు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఉత్పాదక కర్మాగారంలో కార్యకలాపాలు కనీసం రెండు రోజులు నిలిపివేయబడతాయి. ఈ సమయంలో సంస్థ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రపరచనుననారు. సాధారణ కార్యకలాపాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయో లేదో ఇంకా స్పష్టత రాలేదు. బజాజ్ ఆటో తన గత జూన్ డిమాండ్లో 80 శాతం తిరిగి సాధించినటలు బజాజ్ సంస్థ గురువారం ప్రకటించింది. బజాజ్‌ ఆటో కంపెనీకి ఔరంగాబాద్‌తో పాటు పుణెకు సమీపంలోని చకన్, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్ వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి.

ఇలాఉండగా.. మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి అమలు చేసిన లాక్‌డౌన్‌ను అపహాస్యం చేస్తున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


logo