గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 12, 2021 , 02:53:13

ఆర్సెలార్‌ సీఈవోగా ఆదిత్య మిట్టల్‌

ఆర్సెలార్‌ సీఈవోగా ఆదిత్య మిట్టల్‌

  • ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా లక్ష్మీనివాస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రపంచ ఉక్కు దిగ్గజం ‘ఆర్సెలార్‌ మిట్టల్‌' కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా ఆ సంస్థ అధిపతి లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ కుమారుడు ఆదిత్య మిట్టల్‌ నియమితులయ్యారు. లక్సెంబర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం ఆదిత్య మిట్టల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో)గా పనిచేస్తున్నారు. తండ్రి స్థానంలో ఆదిత్య మిట్టల్‌ సీఈవో పదవి చేపట్టనున్నట్లు ఆ కంపెనీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీకి చైర్మన్‌, సీఈవోగా వ్యవహరిస్తున్న లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ ఇకపై ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఆదిత్య స్థానంలో జెన్యునో క్రిస్టినో కంపెనీ సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపడతారని తెలిపింది. 2003లో ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థలో చేరిన క్రిస్టినో 2016 నుంచి కంపెనీ ఫైనాన్స్‌ విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు. 

VIDEOS

logo