శనివారం 06 మార్చి 2021
Business - Feb 11, 2021 , 17:54:32

తండ్రి ల‌క్ష్మీ మిట్ట‌ల్ బాట‌లోనే ఆదిత్య‌!

తండ్రి ల‌క్ష్మీ మిట్ట‌ల్ బాట‌లోనే ఆదిత్య‌!

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ మేటి ఉక్కు దిగ్గ‌జం ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ నూత‌న సీఈవో కం చైర్మ‌న్‌గా యంగ్ త‌రంగ్ ఆదిత్య మిట్ట‌ల్ (45) నియ‌మితులు అ‌య్యారు. ల‌క్ష్మీ పుత్రుడిగా పేరొందిన ల‌క్ష్మీమిట్ట‌ల్ (70) కొడుకే ఈ ఆదిత్య మిట్ట‌ల్‌. ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌ను స్థాపించ‌డంతోపాటు గ్లోబ‌ల్ ఉక్కు మేజ‌ర్‌గా తీర్చిదిద్ద‌డంలో కీల‌క పాత్ర పోషించిన ల‌క్ష్మీ మిట్ట‌ల్ ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం నుంచి కోలుకుని సంస్థ తిరిగి పుంజుకోవ‌డంలో ఆదిత్య మిట్ట‌ల్ కీల‌క పాత్ర పోషించారు. 


ఆదిత్య మిట్ట‌ల్  ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీస‌ర్ (సీఎఫ్‌వో)గా, సంస్థ యూర‌ప్ వ్య‌వ‌హారాల సీఈవోగా ఉన్నారు. 2006లో త‌న 30వ ఏట సంస్థ‌లో అప్రెంటిస్‌గా చేరిన ఆదిత్య మిట్ట‌ల్ రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌లో చేర‌క‌ముందు ఆదిత్య మిట్ట‌ల్.. క్రెడిట్ సూయిజ్ గ్రూప్ ఏజీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో సేవ‌లందించారు. సీఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తూ ఆదిత్య మిట్ట‌ల్.. సంస్థ‌లో నూత‌న అధ్యాయం లిఖించే దిశగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పారు. 


1997లోనే ఆదిత్య మిట్ట‌ల్ .. త‌మ సంస్థ‌లో చేరిన‌ప్ప‌టి నుంచి తామిద్ద‌రం అత్యంత స‌న్నిహితంగా ప‌ని చేశామ‌ని, ఇటీవ‌లి కాలంలో కంపెనీని స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్ల‌డంలో తాము క‌లిసి ప‌ని చేశామ‌ని ల‌క్ష్మీ మిట్ట‌ల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంస్థ‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డం కోసం తాము స‌న్నిహితంగా క‌లిసి ప‌ని చేస్తామ‌ని, దీర్ఘ‌కాలికంగా సంస్థను విజ‌య‌తీరాల‌కు చేర్చేందుకు నిబద్ధ‌త‌తో క్రుషి చేస్తాన‌ని చెప్పారు. ఇక నుంచి రోజువారీ సంస్థ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండ‌నున్న ల‌క్ష్మి మిట్ట‌ల్ త‌మ సంస్థ వాటాదారుల‌కు డివిడెండ్‌ను ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏండ్ల త‌ర‌బ‌డి సంస్థ రుణాల త‌గ్గింపు విష‌య‌మై ఫోక‌స్ పెట్టారు. ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌లో ల‌క్ష్మీ మిట్ట‌ల్‌కు 36 శాతం వాటా ఉంది. 


బ్రిట‌న్‌లో ఒక‌నాడు కుబేరుడిగా పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్న ల‌క్ష్మీ మిట్ట‌ల్‌.. 1976లో ఇండోనేషియాలో రోలింగ్ మిల్లు నుంచి ఉక్కు సంస్థ‌ను స్థాపించారు. 30 ఏండ్ల సుదీర్ఘ ప్ర‌యాణం త‌ర్వాత త‌న ప్రత్య‌ర్థి సంస్థ‌గా ఉన్న ఆర్సెల‌ర్‌ను 34 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కైవ‌శం చేసుకున్నారు. ట‌ర్కీ నుంచి చైనా వ‌ర‌కు త‌క్కువ ధ‌ర‌కే ఉక్కు ఉత్ప‌త్తి చేస్తున్న నేప‌థ్యంలో త‌మ ఉత్ప‌త్తుల మార్కెటింగ్  ఆదిత్య మిట్ట‌ల్‌కు స‌వాల్‌గా ప‌రిణ‌మించ‌నున్న‌ది. సంస్థ‌పై రుణ భారాన్ని తొల‌గించుకోవ‌డానికి ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ అధినేత ల‌క్ష్మీ మిట్ట‌ల్ దాదాపు 15 ఏండ్లు శ్ర‌మించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo