గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 21, 2021 , 01:28:32

రాష్ట్ర మార్కెట్లోకి అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160

రాష్ట్ర మార్కెట్లోకి అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160

హైదరాబాద్‌, జనవరి 20: ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో.. రాష్ట్ర మార్కెట్లోకి అప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు రంగుల్లో లభించనున్న ఈ స్కూటర్‌ ధరను రూ.1,26,372గా నిర్ణయించింది. ఈ స్కూటర్‌కోసం ముందస్తుగా రూ.5 వేలు చెల్లించి హైదరాబాద్‌లో ఉన్న పది డీలర్లతోపాటు https://apriliaindia.com/ నుంచి కూడా బుకింగ్‌ చేసుకోవచ్చును. ఈ సందర్భంగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌(సేల్స్‌, మార్కెటింగ్‌) సుదర్శన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ....గతేడాది కరోనా వైరస్‌ కారణంగా సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైన వృద్ధి..నూతన సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధిస్తామన్న ధీమాను వ్యక్తంచేశారు. మరోవైపు వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని షోరూంలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నది. 

VIDEOS

logo