గురువారం 29 అక్టోబర్ 2020
Business - Sep 29, 2020 , 15:52:41

ఐఫోన్ ఉత్ప‌త్తి.. 6500 కోట్ల యాపిల్ పెట్టుబ‌డి

ఐఫోన్ ఉత్ప‌త్తి..  6500 కోట్ల యాపిల్ పెట్టుబ‌డి

హైద‌రాబాద్‌: యాపిల్ ఐఫోన్ల‌ను విక్ర‌యించే మూడు గ్లోబ‌ల్‌ సంస్థ‌లు ఇండియాలో భారీగా పెట్టుబ‌డులు పెట్టనున్నాయి.  ప్రొడ‌క్ష‌న్ లింక్డ్ ఇన్‌సెంటివ్ స్కీమ్‌కు సుమారు 900 మిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి. యాపిల్ సంస్థ‌తో అనుబంధం ఉన్న కాంట్రాక్ట్ ఉత్ప‌త్తిదారులు  ఈ పెట్టుబ‌డికి పూనుకున్నారు.  రాబోయే అయిదేళ్ల‌లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఫాక్స్ కామ్‌, విస్ట్రాన్‌, పెగ‌ట్రాన్ కంపెనీలు ఈ ఒప్పందం కింద పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి.  6.65 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ప్రొడక్ష‌న్ లింక్డ్ ఇన్‌సెంటివ్ స్కీమ్‌ను త‌యారు చేశారు. అయిదేళ్ల‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాల‌ను పెంచే కంపెనీకి న‌గ‌దు పారితోష‌కాలు ఇవ్వ‌నున్నారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల భార‌త్ ఎగ‌మ‌తి ఉత్ప‌త్తుల కేంద్రంగా  మారుతుంద‌ని భావిస్తున్నారు.  సుమారు 4000 కోట్లు పెట్టుబడి ప ఎట్టేందుకు ఫాక్స్‌కామ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది.  విస్ట్రాన్‌, పెగట్రాన్ సంస్థ‌లు 1300, 1200 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి.  అయితే  మొత్తం 6500 కోట్ల పెట్టుబ‌డి కేవ‌లం యాపిల్ డివైస్‌ల ఉత్ప‌త్తికే వాడుతారా లేదా అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉన్న‌ది. ఐఫోన్ ఉత్ప‌త్తిని విస్త‌రించేందుకు భారీ నిధుల‌ను వాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  logo