ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 03:20:21

భారత్‌లో ఐఫోన్‌ అసెంబ్లర్‌ ప్లాంట్‌

భారత్‌లో ఐఫోన్‌ అసెంబ్లర్‌ ప్లాంట్‌

న్యూఢిల్లీ: యాపిల్‌కు అసెంబ్లింగ్‌ భాగస్వామిగా వ్యవహరిస్తున్న తైవాన్‌ సంస్థ పెగాట్రన్‌ కార్పొరేషన్‌ భారత్‌లో తమ తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీంతో ఈ ఏడాది భారత్‌లోకి భారీగా విదేశీ టెక్‌ పెట్టుబడులు రానున్నాయి. ప్రపంచంలోని టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం గత నెలలో 6.6 బిలియన్‌ డాలర్ల (రూ.49,484 కోట్ల)తో భారీ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లింగ్‌ సంస్థలు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌, విస్ట్రన్‌ కార్పొరేషన్‌ మాదిరిగా భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెగాట్రన్‌ కూడా ఆసక్తి చూపుతున్నది. స్థానికంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముమ్మర కసరత్తు చేస్తున్నది. 


logo