న్యూఢిల్లీ : ఐఫోన్ 13ను టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 12 మోడల్స్ తరహాలోనే ఐఫోన్ 13 సిరీస్ ఉంటుందని యాపిల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ ఐఫోన్ 13 శ్రేణిలో అందుబాటులో ఉండనున్నాయి. లైటెనింగ్ కనెక్టర్‌తో అందుబాడులో ఉండే ఈ ఫోన్లు మరో ఏడాది వరకూ పోర్ట్లెస్గా లభించే అవకాశం లేదు.
పవర్ బటన్‌ను టచ్ ఐడి సెన్సర్‌తో నూతన మోడల్స్ ముందుకొస్తాయని అంచనా వేస్తున్నా తమ తాజా సర్వేలో ఈ నూతన స్పెసిఫికేషన్స్‌పై ఎలాంటి సంకేతాలూ లేవని ఓ యాపిల్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు. ఇక ఐఫోన్ 13 సిరీస్ మెరుగైన, తాజాపరిచిన అమోల్డ్ స్క్రీన్‌తో 120హెచ్జడ్ అప్డేటెడ్ హై రిఫ్రెష్ రేట్‌తో ఉంటుందని అంచనా వేస్తున్నారు.