శాన్ఫ్రాన్సిస్కో : చిప్‌ల కొరతతో జాప్యం జరుగుతున్న యాపిల్ మినీ ఎల్ఈడీ మ్యాక్‌బుక్ ప్రొ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో లాంఛ్ అవుతుందని యాపిల్ మినీ ఎల్ఈడీ సప్లయర్లు చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో న్యూ మ్యాక్‌బుక్స్ రానున్నాయని, ఈ ఏడాది 40 లక్షల మ్యాక్‌బుక్స్ సరఫరా కోసం సరఫరాదారులు సన్నాహాలు చేస్తున్నారని డిజిటైమ్స్ వెల్లడించింది. మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్ అసెంబ్లీ పార్టనర్స్‌కు అవసరమైన ఎల్ఈడీ, ఇతర అనుబంధ పరికరాల షిప్‌మెంట్స్ షెడ్యూల్ ప్రకారం సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
రానున్న మ్యాక్‌బుక్ లైనప్ కోసం యాపిల్ మినీ ఎల్ఈడీ ప్యానెళ్లను వాడుతుండటంతో డిస్ప్లే టెక్నాలజీపై పరిశ్రమ దృష్టిసారించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రీడిజైన్ చేసిన 14, 16 ఇంచ్ మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్ తర్వాతి తరం యాపిల్ సిలికాన్ చిప్ ఫీచర్‌తో రానున్నాయని భావిస్తున్నారు. హెచ్డీఎంఐ పోర్ట్, ఎస్డీ కార్డ్ స్లాట్‌తో మొత్తం న్యూ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.