గురువారం 13 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 11:09:58

అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌

 అత్యంత విలువైన కంపెనీగా  యాపిల్‌

న్యూయార్క్‌: ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీగా  యాపిల్‌ అవతరించింది.  త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత  శుక్రవారం  యాపిల్‌ షేరు ఏకంగా 10శాతానికి పైగా పెరిగింది.    దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 1.82 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నది.  సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని ఆరామ్‌కోను వెనక్కి నెట్టి యాపిల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను దాటి అమెరికాలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ అవతరించిన విషయం తెలిసిందే. logo