శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Feb 13, 2020 , 23:51:10

అపోలో లాభం రూ.90 కోట్లు

అపోలో లాభం రూ.90 కోట్లు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి సంస్థల్లో ఒకటైన అపోలో హాస్పిటల్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. కంపెనీకి చెందిన అన్ని వర్టికల్స్‌ మెరుగైన ప్రదర్శణగావించడం వల్లనే లాభాల్లో 80 శాతం వృద్ధి నమోదై రూ. 89.96 కోట్లు ఆర్జించింది. 2018-19 ఏడా ది ఇదే త్రైమాసికానికిగాను సంస్థ రూ.49.87 కోట్లు లాభాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కన్సాలిడెటేడ్‌ ఆదాయం రూ. 2,495.04 కోట్ల నుంచి రూ.2,911.74 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 


మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3.25 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి తెలిపారు. నూతన టెక్నాలజీ ద్వారా వైద్య సేవలు అందించడం, నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్లకు డిమాండ్‌ నెలకొనడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందన్నారు. గత త్రైమాసికం చివరినాటికి కొత్తగా 14 ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో కొత్తగా 7,470 పడకలు అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.


logo