శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:21:54

చైనా కెమికల్స్‌కు చెక్‌!

చైనా కెమికల్స్‌కు చెక్‌!

న్యూఢిల్లీ: చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్‌ మరిన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న కేంద్రం.. తాజాగా కెమికల్స్‌ దిగుమతులను తగ్గించేయోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి. దేశీయ తయారీదారులను ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి సైతం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించగా, ఇందులో 75 కీలక కెమికల్స్‌తో ప్రత్యేక జాబితాను రూపొందించారు. ఉత్పత్తి విలువలో 10 శాతం రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉన్నది. ఈ కెమికల్స్‌కు చెక్‌ పెట్టడం వల్ల వచ్చే ఐదేండ్లకాలంలో రూ.25 వేల కోట్ల మేర ఆదా కానున్నది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఈ ప్రతిపాదనలు తెరపైకి రావడం గమనార్హం.


logo