గురువారం 28 జనవరి 2021
Business - Nov 28, 2020 , 02:45:35

సింగరేణిలో మరో సోలార్‌ ప్లాంట్‌

సింగరేణిలో మరో సోలార్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సౌర విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణంలో సింగరేణి దూసుకుపోతున్నది. 300 మెగావాట్ల సోలా ర్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తూ.. ఎక్కడికక్కడ గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం 15 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను 132 కేవీ సబ్‌ స్టేషన్‌తో అనుసంధానించారు. రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటులో మొదటి విడుతగా ఈ 15 మెగావాట్ల ప్లాంటును సింగరేణి డైరెక్టర్‌ డీ సత్యనారాయణరావు ప్రారంభించారు. మిగిలిన 35 మెగావాట్ల ప్లాంటు, ఇల్లందులో చివరి దశకు చేరిన మరో 39 మెగావాట్ల ప్లాంటును ఈ డిసెంబరు చివరినాటికి ప్రారంభిస్తామ న్నారు. అలాగే రెండవ దశలో 90 మెగావాట్లు, మూడవ దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ పనులను ఇప్పటికే కాంట్రాక్టులకు అప్పగించినందున నిర్దేశించుకున్న లక్ష్యం 2021 డిసెంబరులోగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ 50 మెగావాట్ల ప్లాంట్లు పూర్తయితే సింగరేణికి ఏటా రూ.17 కోట్ల విద్యుత్‌ ఖర్చులు మిగులుతాయి.


logo