బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 03, 2020 , 23:58:58

హైదరాబాద్‌లో మరో ర్యాన్‌ ఆఫీస్‌

హైదరాబాద్‌లో మరో ర్యాన్‌ ఆఫీస్‌

హైదరాబాద్‌, మార్చి 3: అమెరికాకు చెందిన ట్యాక్స్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ర్యాన్‌..హైదరాబాద్‌లో తన రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం సంస్థ గత కొన్నేండ్లుగా మూడు మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌..భారత్‌లో వ్యాపార విస్తరణలో భాగంగా నెలకొల్పినట్లు కంపెనీ చైర్మన్‌, సీఈవో జీ బ్రింట్‌ ర్యాన్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 60 మంది  సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..వచ్చే ఏడాదిన్నరలో ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. మొదటి సెంటర్‌లో 200 మంది ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా 2013లో భాగ్యనగరంలో 166 సిబ్బందితో తన తొలి సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 నాటికి  522కి పెంచుకున్న సంస్థ..ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 580కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. గతేడాదికిగాను   600 మిలియన్‌ డాలర్ల ఆదాయన్ని గడించింది.      


logo