బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 08, 2020 , 00:33:00

తెలంగాణలో మరో ప్లాంట్‌ సిద్ధమవుతున్న టెక్నో పెయింట్స్‌

తెలంగాణలో మరో ప్లాంట్‌ సిద్ధమవుతున్న టెక్నో పెయింట్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నో పెయింట్స్‌.. ఇక్కడ మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఇప్పటికే ఈ సంస్థకు నాలుగు ప్లాంట్లుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా హైదరాబాద్‌లో ఆరో ప్లాంట్‌ పెట్టాలని ఈ రంగుల తయారీ, కాంట్రాక్ట్‌ కంపెనీ సిద్ధమైంది. విదేశీ మార్కెట్లకు టెక్నో పెయింట్స్‌ను విస్తరించే పనిలో ఉన్నామని, ఇందులో భాగంగానే ఆఫ్రికాలో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థానిక భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని సంస్థ వ్యవస్థాపకుడు ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సంస్థ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 42 వేల మెట్రిక్‌ టన్నులుగా ఉన్నది. ఒక్క సుల్తాన్‌పూర్‌ పారిశ్రామిక వాడలోనే 40 వేల మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. దక్షిణాది రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ మార్కెట్లలో సంస్థ పెయింట్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి.


logo