e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News Ampere New Magnus | మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. ధర కేవలం రూ.68,999

Ampere New Magnus | మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. ధర కేవలం రూ.68,999

Ampere New Magnus | ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్ బ్రాండ్ అంపేర్ ఎల‌క్ట్రిక్ తాజాగా విప‌ణిలోకి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మాగ్న‌స్ ఈఎక్స్ ఆవిష్క‌రించింది. గ్రేవ్స్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ కింద అంపేర్ ఎల‌క్ట్రిక్ త‌న ఉత్ప‌త్తుల‌ను విస్త‌రిస్తోంది. మాగ్న‌స్ రేంజ్‌లో కొత్త‌గా ఆవిష్క‌రించిన మాగ్న‌స్ ఈఎక్స్ స్కూట‌ర్ ఒక‌సారి చార్జింగ్ చేస్తే 121 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంది. దీని ధ‌ర రూ.68,999గా నిర్ణ‌యించారు.

ఈజీగా బ్యాట‌రీ చార్జింగ్ ఇలా

స్లాంటెడ్ క్రెడిట్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న మాగ్న‌స్ ఈఎక్స్‌తో డ్యూయ‌ల్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్యాట‌రీని తేలిగ్గా తీసి ఇంట్లో.. హైరైజ్ బిల్డింగ్‌ల్లోనూ చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఇంటి వ‌ద్ద.. ఆఫీసు.. కాఫీ షాప్‌.. వాల్ చార్జి పాయింట్ వ‌ద్ద ఫైవ్ యాంప్ సాకెట్‌తో తేలిగ్గా చార్జింగ్ చేసుకునే వెసులుబాటు గ‌ల డిటాచ‌బుల్ లైట్ వెయిట్‌, పోర్ట‌బుల్ అడ్వాన్స్డ్ లిథియం బ్యాట‌రీ ఇందులో అమ‌ర్చారు.

డ్యూయ‌ల్ మోడ్స్‌లో ఇలా డ్రైవింగ్‌

- Advertisement -

మాగ్న‌స్ ఈఎక్స్ స్కూట‌ర్‌ను రెండు మోడ్‌ల‌లో డ్రైవ్ చేయొచ్చు. సూప‌ర్ సేవ‌ర్ ఎకో మోడ్‌, ప‌వ‌ర్ మోడ్‌లో డ్రైవ్ చేయ‌వ‌చ్చు. క్రోమ్ ఎంబిల్లిష్‌మెంట్స్‌తో కూడి ఎల్ఈడీ హెడ్ లైట్ అమ‌ర్చారు. పొడ‌వైన వారికి కంఫ్ట‌ర్ విత్ లార్జ్ లెగ్‌రూమ్ స్పేస్‌.. ప్ర‌త్యేకించి మ‌హిళా డ్రైవ‌ర్స్ పెరుగుతున్న నేప‌థ్యంలో వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశారు. మూడేండ్ల వారంటీ ల‌భిస్తుంది.

ఇవీ న్యూ మాగ్న‌స్ ఫీచ‌ర్లు

ఇందులో న్యూ మాగ్న‌స్ ఈఎక్స్ వెహిక‌ల్ ఫైండ‌ర్‌, యాంటీ థెఫ్ట్ అలారం, తేలిగ్గా తొల‌గించేలా బ్యాట‌రీ రూప‌క‌ల్ప‌న త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త చేశారు. మెటాలిక్ రెడ్‌, గ్రాఫైట్ బ్లాక్‌, గ‌లాస్టిక్ గ్రే రంగుల్లో మాగ్నాస్ ఈఎక్స్ స్కూట‌ర్ ల‌భిస్తుంది. అంపేర్ ఎల‌క్ట్రిక్ సీవోవో రాయ్ కురియ‌న్ మాట్లాడుతూ పెట్రోల్ ధ‌ర‌ల‌తో ప్ర‌యాణం వ్య‌య భ‌రితంగా మారుతుంద‌న్నారు. చౌక‌గా ప్ర‌యాణించ‌డానికి క‌స్ట‌మ‌ర్ల‌కు వెసులుబాటుగా ఉంటుంద‌న్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement