బుధవారం 20 జనవరి 2021
Business - Jun 16, 2020 , 00:14:22

రూ. 73,990లకే మాగ్నస్‌ ప్రో ఈ-స్కూటర్‌

రూ. 73,990లకే మాగ్నస్‌ ప్రో ఈ-స్కూటర్‌

ఆంపెర్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌.. సోమవారం మాగ్నస్‌ ప్రో ఈ-స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం  ధర రూ.73,990. సగటు చార్జింగ్‌ ప్రయాణం 75-80 కిలోమీటర్లుగా ఉంటుందని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది.  సరికొత్త రూపంలో మరిన్ని ఫీచర్లతో  ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. మొదట ఈ బైక్‌ను బెంగళూరు మార్కెట్లోవిడుదల చేస్తున్నామని, త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తీసుకోస్తామని ప్రకటించారు. యాంటి తెఫ్ట్‌ అలారం, డిజిటల్‌ ఎల్‌సీడీ క్లస్టర్‌, ముబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌,బైట్‌ ఎల్‌ఈడీ లైట్లు, డీఆర్‌ఎల్‌, టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, 450 ఎంఎం లెగ్‌స్పేస్‌, పెద్ద స్టోరేజ్‌ బూట్‌ స్పేస్‌ వంటి ఫీచర్లు తాజా మోడల్‌లో ఉన్నాయని చెప్పారు. కొత్త ఈ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఈజీ ఈఎంఐ ద్వారా వాహనం పొందవచ్చని పేర్కొన్నారు. 


logo