మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Business - Aug 04, 2020 , 21:26:22

భారత మార్కెట్‌లో ప్రవేశించిన అమెరికా బ్రాండ్‌ వైట్‌ వెస్టింగ్‌ హౌస్‌

భారత మార్కెట్‌లో ప్రవేశించిన అమెరికా బ్రాండ్‌ వైట్‌ వెస్టింగ్‌ హౌస్‌

న్యూ ఢిల్లీ: అమెరికాకు చెందిన అతిపెద్ద కన్స్యూమర్‌ అప్లయెన్సెస్‌ బ్రాండ్‌ వైట్‌ వెస్టింగ్‌హౌస్‌ ఇప్పుడు భారతదేశపు మార్కెట్‌లోకి సెమీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లను విడుదల చేయడం ద్వారా ప్రవేశించింది. భారతీయ తయారీ సంస్థ సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌పీపీఎల్‌) భాగస్వామ్యంతో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. 7కేజీలు, 8కేజీలు, 9కేజీల విభాగాల్లో వాషింగ్‌ మెషీన్లను అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై రూ. 7,499 ఆరంభ ధరతో ఆవిష్కరించనుంది.

ఇండియా బ్రాండ్‌ లైసెన్సీ ఎస్‌పీపీఎల్‌ ఇప్పుడు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటు నోయిడాలో  మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ తయారీకేంద్రం ఏర్పాటుచేయనుంది. దాదాపు వందేళ్లుగా సృజనాత్మక అప్లయెన్సెస్‌కు ప్రసిద్ధిగాంచిన వైట్‌ –వెస్టింగ్‌హౌస్‌ దాదాపు 45కు పైగా దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నది. భారతదేశపు మార్కెట్‌లో బ్రాండ్‌ ప్రవేశం గురించి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పల్లవిసింగ్‌ మాట్లాడుతూ, ‘ఇది సంక్షోభ సమయం. అయితే, అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన బ్రాండ్‌, ఈక్విటీని భారత మార్కెట్‌కు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాం. సామాన్యుల బ్రాండ్‌గా ఖ్యాతి గడించిన డబ్ల్యూడబ్ల్యూహెచ్‌ స్మార్ట్‌ టీవీ విభాగంలో 5% మార్కెట్‌ వాటాను రెండేళ్లలో సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. వాషింగ్‌మెషీన్ల విభాగం పట్ల మేం ఆశాభావంతో ఉన్నాం.’ అని అన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo