మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 12, 2021 , 21:23:52

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ ఒప్పందం స‌స్పెండ్ చేయండి:అమెజాన్‌

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ ఒప్పందం స‌స్పెండ్ చేయండి:అమెజాన్‌

ముంబై: రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ గ్రూప్ మ‌ధ్య రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని స‌మీక్షించేందుకు వీలుగా స‌స్పెండ్ చేయాల‌ని మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ సెబీకి ఈ-కామ‌ర్స్ మేజ‌ర్ అమ‌జాన్ మ‌రోసారి లేఖ రాసింది. త‌మ ఒప్పందం అమ‌లుకు వ్య‌తిరేకంగా నియంత్ర‌ణ సంస్థ‌ల‌కు లేఖ రాయ‌కుండా అమెజాన్ నిలువ‌రించాల‌ని ఫ్యూచ‌ర్స్ గ్రూప్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్‌ కొట్టివేసింది. 

సింగ‌పూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ (ఎస్ఐఏసీ) జారీ చేసిన ఆదేశాల ఆధారంగా నియంత్ర‌ణ సంస్థ‌ల ముంగిట్లోకి వెళ్ల‌కుండా నిలువ‌రించాల‌ని ఫ్యూచ‌ర్స్ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు వాదించింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధంగా లేర‌ని స‌మాచారం. త‌న జియోమార్ట్ ద్వారా కిరాణా స్టోర్ల‌కు స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని రిల‌య‌న్స్ రిటైల్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo