శుక్రవారం 04 డిసెంబర్ 2020
Business - Sep 23, 2020 , 00:49:43

తెలుగులో అమెజాన్‌ సేవలు

తెలుగులో అమెజాన్‌ సేవలు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో నాలుగు భాషల్లో సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే పండుగ సీజన్‌లో నూతన వినియోగదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుతోపాటు కన్నడ, మళయాళం, తమిళ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కేవలం హిందీ, ఇంగ్లీష్‌లలో మాత్రమే సేవలు అందిస్తుండేది.