శుక్రవారం 22 జనవరి 2021
Business - Jan 14, 2021 , 02:55:27

రూ.89కే ప్రైమ్‌ వీడియో

రూ.89కే ప్రైమ్‌ వీడియో

న్యూఢిల్లీ, జనవరి 13: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌-ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. ఒక్క వినియోగదారుడు మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుండే ఈ ప్లాన్‌ను రూ.89 ధరతో తీసుకొచ్చింది. 6 జీబీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీతో లభ్యమయ్యే ఈ ప్లాన్‌ తొలుత ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌కు సైనప్‌ అయితే 30 రోజులు ఉచితంగా వీడియోలు చూడొచ్చని, ఆ తర్వాత రూ.89 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.


logo